‘నాన్నను చంపినవారిపై కోపం లేదు’

తన తండ్రి రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారిని తాను క్షమించానని రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం పుదుచ్చేరిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు. అక్కడి భారతీదాసన్‌ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన, ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు.

Published : 18 Feb 2021 01:54 IST

పుదుచ్చేరిలో రాహుల్‌గాంధీ

పుదుచ్చేరి: తన తండ్రి రాజీవ్‌గాంధీని హత్య చేసిన వారిని తాను క్షమించానని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈ మేరకు బుధవారం పుదుచ్చేరిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన వెల్లడించారు. అక్కడి భారతీదాసన్‌ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించిన ఆయన, ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ మీ నాన్నగారిని ఎల్టీటీఈ (లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం) కు సంబంధించిన వ్యక్తులు హత్య చేశారు. వారిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. ‘‘ నా తండ్రి మరణం నన్ను ఎంతగానో కుంగదీసింది. కానీ నాకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేవు. నేను దీనికి కారణమైన వారిని క్షమించాను. హింస వల్ల ఎవరికీ ఏమీ రాదు. మా నాన్న నాతోనే, నాలోనే ఉన్నారు. నా ద్వారా మాట్లాడుతున్నారు.’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ బలం తగ్గుతుండంతో కాంగ్రెస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ రోజు ఉదయం పుదుచ్చేరికి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి మత్సకారులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటించారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేదీని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని