Parliament: నాకు నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తా: జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌

గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురికావడంతో సభలోని ఇతర ఎంపీలు ఆందోళన చేపట్టారు. అయితే, రాజ్యసభ సభ్యుడు.. సుప్రీకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌

Published : 11 Dec 2021 01:24 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, రాజ్యసభ సభ్యుడు.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ మాత్రం సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది రాజ్యసభకు ఆయన నామినేట్‌ అయ్యారు. అయితే ఆయన సమావేశాల హాజరు శాతం పదిలోపే ఉంది. ఈ విషయంపై ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ స్పందించారు. తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

‘‘నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నాను. అసోం నుంచి వచ్చిన నేను ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై సభలో గళం విప్పాలనే భావించా. కానీ, కరోనా వ్యాప్తి.. వైద్యుల సూచనల మేరకు సమావేశాలకు హాజరుకావట్లేదు. ఈ మేరకు రాజ్యసభకు లేఖ కూడా పంపించాను. అయినా.. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తేనే సభకు వెళ్తాను. నేను నామినేటెడ్‌ పద్ధతిలో ఎన్నికైన రాజ్యసభ స్వతంత్ర సభ్యుడిని. నన్ను ఏ పార్టీ ఆదేశించలేదు. నాకు నచ్చినప్పుడు వస్తా.. నచ్చినప్పుడు వెళ్తా. ఇంకా కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. ఈ సమయంలో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నా.. సభలో అది జరగట్లేదు. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ కూడా అసౌకర్యంగా ఉంది’’అని జస్టిన్‌ రంజన్‌ గొగొయ్‌ తెలిపారు.

Read latest Political News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని