Published : 25 Jun 2022 01:27 IST

Maharashtra: హోటల్‌ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) వర్గంలో శాసనసభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఒత్తిడి కారణంగానే ఏక్‌నాథ్‌ వర్గంలో చేరుతున్నారని, తాను తప్పించుకొని వచ్చినట్లు ఒస్మానాబాద్‌ ఎమ్మెల్యే కైలాస్‌ పాటిల్‌ (Kailas Patil) పేర్కొన్నారు. ‘తమ మీద ఒత్తిడి కారణంగానే కొందరు సంతకాలు చేస్తున్నారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం ఆయన వెంటే ఉంటాం’ అని వెల్లడించారు.

ఓ జాతీయ మీడియా సంస్థతో కైలాస్‌ పాటిల్‌  మాట్లాడుతూ.. ‘జూన్‌ 20న ఠాణేలోని ఓ హోటల్‌లో డిన్నర్‌కు ఏక్‌నాథ్‌ శిండే నన్ను ఆహ్వానించారు. డిన్నర్‌ ముగిసిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలను కార్లలో సూరత్‌కు తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్నా. దీంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చా. కిలోమీటర్ల పాటు నడుచుకుంటా వెళ్లా. అనంతరం ఓ ద్విచక్రవాహనదారుడి సాయంతో ముఖ్యమంత్రి నివాసానికి చేరా’ అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. తనను కిడ్నాప్‌ చేసి గుజరాత్‌కు బలవంతంగా తీసుకెళ్లారని ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ రెండు రోజుల క్రితం ఆరోపించారు. వారి నుంచి తప్పించుకుని ముంబయికి వచ్చేశానని, తన మద్దతు ఉద్ధవ్‌ ఠాక్రేకే అని స్పష్టం చేశారు. ‘ఏక్‌నాథ్‌ శిందే నన్ను తప్పుదోవ పట్టించి సూరత్‌ తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక అసలు విషయం తెలిసి నేను హోటల్‌ నుంచి బయటకు వచ్చాను. కానీ నన్ను పోలీసులు అడ్డుకున్నారు. నాకు గుండెపోటు వచ్చిందంటూ బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఆ తర్వాత ఆసుపత్రిలోనూ నన్ను హత్య చేయడానికి కుట్రలు జరిగాయి. ఏదో ఇంజెక్షన్‌ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని ముంబయి చేరుకున్నా’ అని దేశ్‌ముఖ్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని