Contractor suicide case: అందుకే రాజీనామా చేస్తున్నా.. మళ్లీ మంత్రినవుతా: ఈశ్వరప్ప

కర్ణాటకలో గుత్తేదారు సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా....

Published : 15 Apr 2022 16:12 IST

శివమొగ్గ: కర్ణాటకలో గుత్తేదారు సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. రాజీనామాను లేఖను ఈ సాయంత్రం సీఎం బసవరాజ్‌ బొమ్మైకి అందజేయడానికి ముందు శివమొగ్గలో ఆయన తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. తనపై కుట్రలో భాగంగా వస్తోన్న ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడతాననీ.. మళ్లీ మంత్రి అవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన బెంగళూరు బయల్దేరే ముందు రాజీనామా చేయొద్దంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేయగా.. కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. వీటి నుంచి తాను బయట పడాలంటే నిర్దోషిగా రుజువుకావాల్సి ఉంటుదన్నారు. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు మంత్రిగా ఉంటే దర్యాప్తును తాను ప్రభావితం చేశాననే భావన ఏర్పడుతుందనీ.. అందుకే మంత్రిగా రాజీనామా చేస్తున్నానన్నారు. ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాననీ.. మళ్లీ తప్పకుండా మంత్రి అవుతానని కార్యకర్తలకు చెప్పారు.

అలాగే, మీడియాతో మాట్లాడుతూ.. ఇది తనకు ఓ అగ్నిపరీక్షలాంటిదన్నారు. కుట్రలో భాగంగానే తనపై అనేకమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్ర నుంచి బయటపడతానని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ సాయంత్రం తన రాజీనామాను సీఎంకు అందజేయనున్నట్టు తెలిపారు. తానెంతగానో అభిమానించే యడియూరప్ప వంటి నేతలు, సీఎం బొమ్మై, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల మద్దతు చూసి భావోద్వేగానికి గురైనట్టు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని