అధికారంలోకి వస్తే సీఏఏను అమలుచేయబోం: స్టాలిన్‌

తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేయబోమని డీఎంకే అధినేత స్టాలిన్‌ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు....

Published : 30 Mar 2021 11:28 IST

చెన్నై: తమిళనాడులో తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలుచేయబోమని డీఎంకే అధినేత స్టాలిన్‌ స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో భాజపాకు మద్దతిచ్చిన అన్నాడీఎంకేపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే, పీఎంకే సభ్యులు సీఏఏకు మద్దతుగా రాజ్యసభలో ఓటు వేసిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తుచేశారు. జోలార్‌పేట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్టాలిన్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏపై అన్నాడీఎంకే నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మైనారిటీలకు డీఎంకే ఎప్పుడూ మద్దతుగానే నిలుస్తుందన్న ఆయన తాము పార్లమెంట్‌లో ఈ బిల్లును వ్యతిరేకించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు రూ.వెయ్యి ఇస్తామని.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని