
UP Elections: రైళ్లకు లేని చలాన్లు.. బైకులకెందుకు?
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపించిన వేళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్ ఇస్తాం.. ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకున్న సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కూడా ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే యూపీలో బైక్‌పై ట్రిపుల్ రైడ్‌కు అనుమతి ఇస్తామని చెప్పారు.
‘‘ఒక రైలు బోగిలో 70 సీట్లుంటే 300 మంది ప్రయాణిస్తున్నారు. ఆ రైళ్లకు ఎలాంటి చలాన్లు వేయరు. అలాంటప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తే బైకులకు ఎందుకు చలాన్లు వేస్తున్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రిపుల్ రైడింగ్‌కు అనుమతి ఇస్తాం. ఒకవేళ అనుమతి ఇవ్వలేని పరిస్థితి వస్తే.. జీపులకు, రైళ్లకు జరిమానాలు విధిస్తాం’’అని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తెలిపారు. అయితే, రాజ్‌భర్ హామీపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆయన లేవనెత్తిన విషయం సహేతుకంగానే ఉందని కొందరు, ఇది వితండవాదమని మరికొందరు అంటున్నారు.
యూపీలోని 403 నియోజకవర్గాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. పూర్తి ఫలితాలు మార్చి10న వెల్లడవుతాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Swara Bhaskar: నటి స్వర భాస్కర్‌ను చంపుతామంటూ బెదిరింపు లేఖ
-
Crime News
Crime News: దిల్లీ నుంచి హైదరాబాద్‌కు కొకైన్... కొనుగోలు చేసిన 17మంది కోసం వేట
-
Business News
WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్
-
General News
Andhra News: 5 రోజుల పనిదినాలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. ఉద్యోగుల్లో సందిగ్ధత
-
Business News
PPF loan: పీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- Hema Chandra - Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ