Sanjay Raut: తెదేపా స్పీకర్‌ అభ్యర్థిని నిలిపితే ‘ఇండియా’ మద్దతు!

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో తెదేపా తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు.

Updated : 17 Jun 2024 06:49 IST

శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటన

ముంబయి: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో తెదేపా తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ముంబయిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..స్పీకర్‌ ఎన్నిక చాలా ముఖ్యమైందన్నారు. ఒకవేళ ఆ పదవిని భాజపా దక్కించుకుంటే ప్రభుత్వానికి మద్దతిస్తున్న తెదేపా, జేడీయూలతోపాటు చిరాగ్‌ పాస్వాన్, జయంత్‌ చౌధరిల పార్టీలను చీలుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అనుభవం ఉందన్నారు. ‘‘స్పీకర్‌ పదవికి తెదేపా తన అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటోందని నాకు తెలిసింది. అదేకనక జరిగితే ఇండియా కూటమి భాగస్వాములు దీనిపై చర్చిస్తారు. అంతేకాకుండా వారంతా తెదేపాకు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారు’’ అని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కుతుందన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానిది సుస్థిర పాలన కాదని అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని