Pashupati Paras: ఎల్‌జేపీ అధ్యక్షుడు పరాస్‌పై ‘ఇంక్‌’ దాడి

ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రివర్గంలో చేరిన అనంతరం మొట్టమొదటిసారి తన నియోజకవర్గమైన బిహార్‌లోని.....

Published : 24 Aug 2021 01:44 IST

పాట్నా: ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి పశుపతి పరాస్‌కు తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. కేంద్ర మంత్రివర్గంలో చేరిన అనంతరం మొట్టమొదటిసారి తన నియోజకవర్గమైన బిహార్‌లోని హాజీపుర్‌లో పర్యటించిన ఆయనపై ఓ మహిళ ఇంక్‌తో దాడిచేసింది. లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేత సోమవారం హాజీపుర్‌కు చేరుకోగానే చిరాగ్‌ పాసవాన్‌ మద్దతురాలు ఆయనపై ఇంక్‌ చల్లింది. దీంతో పరాస్‌ కొద్దిసేపటికి తన దుస్తులను మార్చుకున్నారు.

దళిత నేత, దివంగత రాంవిలాస్ పాసవాన్ నెలకొల్పిన ఎల్జేపీలో కొద్ది నెలల క్రితం తిరుగుబాటు జెండా ఎగిరింది. ఆయన చిన్న తమ్ముడైన పశుపతి పరాస్‌ ఇందుకు నాయకత్వం వహించారు. రాంవిలాస్ కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్‌తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్‌సభ సభ్యులుండగా, అందులో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. అనంతరం పశుపతి పరాస్ ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని