CPI Ramakrishna: ఏపీలో కీలక దస్త్రాల మాయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి: సీపీఐ రామకృష్ణ

కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated : 10 Jun 2024 10:43 IST

అమరావతి: కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వైకాపా హయాంలో ఇసుక, మైనింగ్, ఎక్సైజ్‌ తదితర శాఖల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఫైళ్ల మాయం ఆందోళనకరమన్నారు. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని రామకృష్ణ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని