Devineni Avinash: వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ సోదాలు

విజయవాడలో ఐటీ సోదాల కలకలం రేగింది. విజయవాడలో వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Updated : 06 Dec 2022 19:19 IST

విజయవాడ: నగరంలో ఐటీ సోదాల కలకలం రేగింది. విజయవాడలో వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుణదలలోని ఆయన నివాసంలో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు