Jagan: స్పీకర్‌ స్థానంలో అయ్యన్న.. శనివారం సభకు రాకూడదని జగన్‌ నిర్ణయం

స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రామానికి దూరంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.

Updated : 22 Jun 2024 10:08 IST

అమరావతి: ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే, తెదేపా సీనియర్‌నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభకు రాకూడదని వైకాపా నిర్ణయించింది. స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ భావించినట్టు సమాచారం. ఎన్నికైన సభాపతిని అధికార, విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎప్పట్నుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్‌ తిలోదకాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జగన్‌ వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్‌ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైకాపా వర్గాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు