Jagtial MLA: కాంగ్రెస్‌లోకి జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల భారాస ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 24 Jun 2024 03:50 IST

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఇప్పటివరకు హస్తం గూటికి అయిదుగురు భారాస ఎమ్మెల్యేలు

సంజయ్‌కుమార్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో మంత్రి పొంగులేటి 

ఈనాడు, హైదరాబాద్‌: జగిత్యాల భారాస ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్‌కుమార్‌.. 2023 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం భారాస అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఆదివారం కాంగ్రెస్‌ గూటికి చేరారు. భారాస నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతో పాటు మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా ఆ జాబితాలో సంజయ్‌కుమార్‌ చేరారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు