
Published : 10 Dec 2021 01:42 IST
AP news: హిందూపురంలో 3 రాజధానుల మద్దతు ర్యాలీలో జై బాలయ్య నినాదాలు
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం వైకాపా నాయకుడు నవీన్ నిశ్చల్.. కార్యకర్తలతో కలిసి మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంబేడ్కర్ కూడలికి చేరుకోగానే.. అందులో పాల్గొన్న విద్యార్థులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైకాపా కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్రమత్తమైన వైకాపా కార్యకర్తలు విద్యార్థులను వారించి యథావిధిగా ర్యాలీ కొనసాగించారు.
► Read latest Political News and Telugu News
ఇవీ చదవండి
Tags :