JaiRam Ramesh: మునుగోడులో ఓట్లు కాదు.. నోట్ల వరద పారింది: జైరాం రమేశ్‌

మునుగోడులో మద్యం, డబ్బుతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాటం చేశారని ఆయన కొనియాడారు.

Updated : 07 Nov 2022 17:05 IST

కామారెడ్డి: మునుగోడులో మద్యం, డబ్బుతోనే ఎన్నికలు జరిగాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గట్టిగా పోరాటం చేశారని ఆయన కొనియాడారు. ఉపఎన్నిక ఫలితాలపై పూర్తి స్థాయిలో సమీక్షించుకొని మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘మునుగోడు ఎన్నికలో ఓట్లు కాదు.. నోట్ల వరద పారింది. అవి ఓట్ల ఎన్నికలు కాదు.. నోట్ల ఎన్నికలు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. మద్యం, సంపదలే విజయం సాధించాయి. అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారు. కోట్లు సంపాదించిన వారితో ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చింది. తెలంగాణలో వన్‌సీఆర్‌, టూసీఆర్‌, త్రీసీఆర్‌, ఫోర్‌ సీఆర్‌.. కేసీఆర్‌ అని గద్దర్‌ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తోంది. 15రోజుల పాటు పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తెరాస నేతలు అక్కడ మోహరించారు. మద్యం ఏరులై పారించి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేశారు. మునుగోడు ఓటమితో నిరాశ చెందడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెరాస - కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది’’ అని జైరాం రమేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని