Jairam Ramesh: ‘కాంగ్రెస్‌ పేరిట ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి.. ఆ పదంపై పేటెంట్‌ తీసుకోవాల్సింది!’

బలమైన కాంగ్రెస్ లేకుండా.. దేశంలో విపక్షాల ఐక్యత అసంభవమని పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లలో వివిధ పార్టీలు తమ నుంచి చాలా తీసుకున్నాయని, కానీ.. తిరిగి ఏం ఇవ్వలేదని విమర్శించారు. ‘కాంగ్రెస్‌ అనే పదంపై మేం పేటెంట్ హక్కులు తీసుకోవాల్సింది. కానీ, తప్పు చేశాం’ అని వ్యాఖ్యానించారు.

Published : 07 Dec 2022 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బలమైన కాంగ్రెస్‌(Congress) లేకుండా.. దేశంలో విపక్షాల ఐక్యత అసంభవమని పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేశ్‌(Jairam Ramesh) అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఇతర పార్టీలు భర్తీ చేయడంపై స్పందించారు. గత కొన్నేళ్లలో వివిధ పార్టీలు తమ నుంచి చాలా తీసుకున్నాయని, కానీ.. తిరిగి ఏం ఇవ్వలేదని విమర్శించారు.

‘కాంగ్రెస్‌ అనే పదంపై మేం పేటెంట్ హక్కులు తీసుకోవాల్సింది. కానీ, తప్పు చేశాం. నేడు దేశంలో కాంగ్రెస్ పేరిట అనేక పార్టీలు ఉనికిలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు ఉదాహరణలు. ఇలా అనేక పార్టీలు కాంగ్రెస్‌ నుంచే పుట్టుకొచ్చాయి. వారూ కాంగ్రెస్‌ పేరు పెట్టుకోవడంతో.. పార్టీకి నష్టం వాటిల్లింది’ అని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే.. పార్టీని బలోపేతం చేస్తామని, ఐక్యత విషయంలో విపక్ష పార్టీలతోనూ మాట్లాడతామని ఆయన అన్నారు. అయితే.. ప్రతిపక్షాల ఐక్యతతో భారత్ జోడో యాత్రకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా.. రాహుల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు