తండ్రిలాంటి వారని.. ఇలా చేయడం తగదని ఎమ్మెల్యే రాజయ్యకు చెప్పా: జానకిపురం సర్పంచి నవ్య
స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య రెండేళ్లకుపైగా తనను వేధిస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచి కురుసపల్లి నవ్య ఆరోపించారు.
ధర్మసాగర్, న్యూస్‌టుడే: స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.రాజయ్య రెండేళ్లకుపైగా తనను వేధిస్తున్నారని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచి కురుసపల్లి నవ్య ఆరోపించారు. గ్రామంలో శుక్రవారం తన భర్త ప్రవీణ్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘నన్ను ఎమ్మెల్యే వేధిస్తున్నారు. పిల్లల పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు మాకు తండ్రిలాంటి వారని, ఇలా చేయడం తగదని చెప్పా. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉన్నాం. మా గ్రామానికి మొదటి నుంచీ నిధులు ఇవ్వడంలేదు. చాలామంది మహిళలు సార్ వద్దకు వచ్చిపోతున్నారని, మీరూ వస్తే మీ గ్రామానికి నిధులు, మీ అవసరాలు తీరుస్తారంటూ... భారాస మహిళ ఒకరు నన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి దాన్ని కాదని ఆమెకు నేను స్పష్టంగా చెప్పా. ఆమె పేరును సమయం వచ్చినప్పుడు చెబుతా. అందరి జాతకాలు నా వద్ద ఉన్నాయి. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయా. నా మీద కోరికతో, నేనంటే ఇష్టంతో పార్టీ టికెట్ ఇచ్చానంటాడా..? బిడ్డ లాంటిదానితో ఐ లవ్యూ అంటాడా..? తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. ఎవరో వెనక ఉండి కావాలని, చేయిస్తున్నారంటారా? నేను ఆడపిల్లనా..? ఆట బొమ్మనా..? అందరి ముందుకొచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నేను బయటికొస్తే, ఎమ్మెల్యే వేధింపులకు గురైన మిగతా మహిళలూ బయటకొస్తారు. రాజయ్య వేధింపులపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తా. వారు నా ఆవేదనను అర్థం చేసుకుని, న్యాయం చేస్తారని నమ్మకముంది’ అని అన్నారు.
అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర: ఎమ్మెల్యే రాజయ్య
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తనని అప్రతిష్ఠపాలు చేసేందుకే కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... ఇంటి దొంగలు శిఖండి పాత్ర పోషిస్తున్నారనీ, సమయం వచ్చినప్పుడు సీఎంను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి
-
Pawan Kalyan: జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వం: పవన్ కల్యాణ్
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు