ప్రతిభకు పట్టంకట్టేలా పద్మ అవార్డులు : పవన్‌

ప్రతిభావంతులకు పట్టంకట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక జరిగిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ‘పద్మవిభూషణ్‌’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు..

Published : 27 Jan 2021 01:57 IST

అమరావతి: ప్రతిభావంతులకు పట్టంకట్టే విధంగా పద్మ పురస్కారాల ఎంపిక జరిగిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ‘పద్మవిభూషణ్‌’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన నేపథ్యంలో పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ సంగీత రంగంపై ఎస్పీ బాలు ముద్ర చెరగనిదని కొనియాడారు. మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేయడం ఆయన కీర్తిని మరింత పెంచిందన్నారు. ప్రముఖ గాయని చిత్రను ‘పద్మభూషణ్‌’కు ఎంపిక చేయడం సంతోషకరమని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా దక్షిణాది భాషలతో పాటు పలు ఇతర భాషల్లో తన గళంతో శ్రోతలను మైమరిపించారన్నారు. 

వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాంసురాలు సుమతి, అవధాన విద్యలో దిట్టగా నిలిచిన ఆశావాది ప్రకాశరావు, ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న కనకరాజులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేయడం కళలకు మరింత జీవం పోసినట్లయిందన్నారు. వీరందరికీ తనతో పాటు జనసేన తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

గానగంధర్వుడికి పద్మవిభూషణ్‌

మహావీరుడు మన సంతోష్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని