Vizag: 61 మంది జనసేన నేతలు విడుదల.. 9 మందికి రిమాండ్‌

విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టు అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. 61 మందిని రూ.10వేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మిగిలిన 9 మందికి ఈనెల 28 వరకు రిమాండ్‌ విధించింది.

Updated : 17 Oct 2022 14:39 IST

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై దాడి ఘటనలో అరెస్టు అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. 61 మందిని రూ.10వేల పూచీకత్తుపై కోర్టు వారిని విడుదల చేసింది. మిగిలిన 9 మందికి ఈనెల 28 వరకు రిమాండ్‌ విధించింది. 9 మందిపై 307 సెక్షన్‌ తొలగించి 326 సెక్షన్‌గా మార్చి రిమాండ్‌ విధించారు. రిమాండ్‌ విధించిన వారిలో కోన తాతారావు, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల సందీప్‌, కొల్లూరి రూప, పీతల మూర్తి యాదవ్‌, పీవీఎస్‌ఎన్‌ రాజు, చింతపల్లి శ్రీను, బోగి శ్రీనివాస్‌ పట్నాయక్‌, రాయపురెడ్డి కృష్ణ ఉన్నారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం వారిని విశాఖ కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. 

అంతకుముందు హైడ్రామా మధ్య పోలీసులు జనసేన నేతలను ఏడో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. వారిని కోర్టుకు తీసుకొచ్చే సమయంలో ప్రాంగణం అన్ని గేట్లు దిగ్బంధం చేశారు. మరోవైపు 92 మంది జనసైనికులపై కేసు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేసినట్లు జనసేన లీగల్‌ పేర్కొంది. అరెస్టు చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండ్‌ విధించారని, 61 మంది జనసైనికులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్లు జనసేన తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని