Nadendla: అందుకే అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్‌: నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం పాల్పడుతోందని జనసేన రాజకీయ

Published : 17 Aug 2022 14:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైకాపా ప్రభుత్వం పాల్పడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. ఉపాధ్యాయులను వదిలించుకొని ప్రభుత్వ పాఠశాలలను బైజూస్‌లాంటి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులను వేధించే చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి జగన్‌.. ఉపాధ్యాయుల హాజరులో నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్‌ అంటూ ఉత్తర్వులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సీఎం సచివాలయానికి ఎప్పుడూ వెళ్లకపోవడం వల్ల అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్‌ అయిపోయిందని నాదెండ్ల ఎద్దేవా చేశారు.

‘‘ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, హాజరు పేరుతో బలవంతంగా సెలవులు పెట్టించి ప్రజలకు శుత్రువులుగా చూపించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తున్న తీరు, తమకు దక్కాల్సిన జీతభత్యాలు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీపీఎస్‌ రద్దు వంటి వాటి గురించి టీచర్లు ప్రశ్నిస్తున్నారనే వారిని ప్రభుత్వం వేధిస్తోంది. అర్థం లేని ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్స్‌, పొటోలు తీయడం వంటి పనులను ప్రభుత్వం పక్కన పెట్టాలి. ఈ చర్యలను జనసేన పార్టీ ఖండిస్తోంది. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేయాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని