Andhra News: అబద్ధాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడికి తెలిసిన విద్య: నాదెండ్ల మనోహర్
టికొచ్చిన అబద్ధాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడైన సీఎం జగన్‌కు తెలిసిన విద్య అని జనసేన పార్టీ
అమరావతి: నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడైన సీఎం జగన్‌కు తెలిసిన విద్య అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గడప గడపలో వైకాపా ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి.. పరిపాలన చేతగాని జగన్‌లో ఆందోళన మొదలైందని ఓ ప్రకటనలో విమర్శించారు.
అడిగితే కక్ష సాధింపులా?
‘‘పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడేమో 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారు. రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని పథకానికి ఎందుకు దూరం చేశారో చెప్పాలి. 2021లో లక్షా 19వేల మందికి ఇస్తున్నామని చెప్పి.. 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా? జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి.
మద్య నిషేధం ఎక్కడా?
మహాదాత మల్లాడి సత్యలింగం పేరు పలికే అర్హత సీబీఐ దత్తపుత్రుడికి ఉందా? ఆయన దానం చేసిన ఆస్తులను, భూములను వైకాపా వాళ్లు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా? వైకాపా మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్... అదీ అరకొర ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం తీసుకొస్తామని మాట తప్పారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి.. వాటిని ఎగ్గొట్టే పనిలో ఉన్నారు.
సమాధానం చెప్పుకోలేని స్థితికి జగన్..
వైకాపా దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైకాపా నేతల్లో ఆందోళన మొదలైంది’’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్‌కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్‌లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్‌ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్‌లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్‌రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి