Pawan Kalyan: ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన స్పెషల్‌ సాంగ్‌

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు సహా 21 షరతులతో సభకు పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ..

Updated : 12 Mar 2022 06:49 IST

అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు సహా 21 షరతులతో సభకు పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో  ఈనెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ... సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆవిర్భావ సభ సందర్భంగా యూట్యూబ్‌లో ప్రత్యేక గీతం విడుదల చేశారు. జనసైనికులను ఉత్సాహపరిచేలా ఉన్న స్పెషల్‌ సాంగ్‌ పవన్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక గీతం పోస్టర్‌పై ‘‘ భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది’’ అంటూ పార్టీ శ్రేణులకు పవన్‌ సందేశమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని