JC Prabhakar Reddy: 10 రోజుల్లో న్యాయం జరగాలి.. లేదంటే కుటుంబమంతా నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్‌రెడ్డి

వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 19 Jun 2024 15:25 IST

అనంతపురం: వైకాపా ప్రభుత్వ హయాంలో బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలంటూ జైలుకు పంపారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నా బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారు. బీఎస్‌ 3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్‌ చేసినవారు ఇంటికి పోయారు. 10 రోజుల్లో నాకు న్యాయం జరగాలి.. లేదంటే నా కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపడతాం. ఈ విషయం సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. నా వ్యక్తిగత విషయం.. నాకు న్యాయం జరగాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే పార్టీకీ రాజీనామా చేస్తా’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని