పొత్తుకే ప్రాధాన్యం.. లేదా ఒంటరిగానే పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌ ఎన్నికల్లో భాజపాతో కలిసే పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని, లేని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి స్పష్టం చేశారు. మిత్రపక్షాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పోటీ చేసే సత్తా తమకు ఉందని

Published : 09 Aug 2021 01:14 IST

జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి


దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌ ఎన్నికల్లో భాజపాతో కలిసే పోటీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని, లేని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఆదివారం స్పష్టం చేశారు. మిత్రపక్షాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా పోటీ చేసే సత్తా తమకు ఉందని పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజీవ్‌ రంజన్‌సింగ్‌ శనివారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. త్యాగి మాటలు ఆసక్తికరంగా మారాయి. యూపీలో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని త్యాగి సైతం గతంలో ఓసారి ప్రకటించారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. దీంతో పార్టీకి నష్టం జరిగిందని ఆయన అప్పుడు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. భాజపా, జేడీయూలు బిహార్‌లో మిత్రపక్షాలు కావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో యూపీ, మణిపూర్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని