Jeevan Reddy: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా: జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో తాజా పరిణామాలతో తీవ్రంగా అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Updated : 25 Jun 2024 14:34 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదనీ.. ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్‌కుమార్‌ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ నేతలు రంగంలోకి దిగారు. బేగంపేటలోని జీవన్‌రెడ్డి నివాసంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని