JP Nadda: కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి: జేపీ నడ్డా

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలన రజాకార్లను తలపిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారాస కుటుంబపాలన అంతం కావడం ఖాయమన్నారు.

Updated : 06 Oct 2023 16:35 IST

ఘట్‌కేసర్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలన రజాకార్లను తలపిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారాస కుటుంబపాలన అంతం కావడం ఖాయమన్నారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన భాజపా రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కార్‌ నిధులు కేటాయించడం లేదని భారాస నేతలు చేస్తున్న విమర్శలను నడ్డా తిప్పికొట్టారు. తెలంగాణ వికాసం కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా లెక్కలతో సహా వివరించారు. ఇటీవల గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును మోదీ ప్రకటించారని గుర్తు చేశారు.

‘‘జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించింది. అందుకే ప్రతి రాష్ట్రంలో క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి భారాస) ఆ విధంగా ఆవిర్భవించిందే. అందుకే చాలాకాలం పాటు జాతీయ ఆకాంక్షలు విస్మరణకు గురయ్యాయి. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. క్రమక్రమంగా ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. భారాస కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని