JP Nadda: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సిద్ధమా?: పార్టీ నేతలతో జేపీ నడ్డా

దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై.. భాజపా 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

Published : 09 Jul 2023 20:40 IST

హైదరాబాద్‌: దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై.. 11 రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి గల కారణాలపైన లోతుగా విశ్లేషించారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దక్షిణాది ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ నేతలను నడ్డా ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్ల చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నడ్డా.. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించినట్లు సమాచారం.

మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని జేపీ నడ్డా దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నడ్డా అన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రజలు బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

నోవాటెల్ హోటల్‌లో బస

తెలంగాణ నేతలతో కాసేపట్లో జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం అంశాలపై చర్చించనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత రాత్రికి నోవాటెల్ హోటల్‌లోనే నడ్డా బస చేయనున్నారు. రేపు ఉదయం తిరిగి దిల్లీకి వెళ్లనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని