BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా

భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్టోబర్‌ రెండో వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 6న రాష్ట్రానికి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు.

Published : 02 Oct 2023 23:05 IST

హైదరాబాద్‌: అక్టోబరు ఒకటో తేదీ నుంచి శాసనసభ ఎన్నికలయ్యే వరకూ అమలు చేయాల్సిన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే ‘పాలమూరు ప్రజాగర్జన’ పేరుతో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించగా.. భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్టోబర్‌ రెండో వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 6న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌ శివారు ఘట్‌కేసర్‌లో జరిగే భాజపా రాష్ట్ర కౌన్సిల్‌ భేటీకి నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో ఎన్నికల కార్యక్రమ నియమావళిపై పకడ్బందీగా షెడ్యూలును రూపొందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని