Jupalli: కేసీఆర్‌ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు

భాజపాకు పార్లమెంటులో కేసీఆర్‌ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

Updated : 07 Jul 2024 14:26 IST

హైదరాబాద్‌: భాజపాకు పార్లమెంటులో కేసీఆర్‌ అనేక అంశాల్లో మద్దతు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రతి సందర్భంలో రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిచి కేసీఆర్‌ ప్రధాని అవ్వాలని కలలు కన్నారు. ఆయనే మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు? ప్రజలు ఎక్కడైనా తప్పు చేస్తారా? ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేశారా? దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ సీఎం అయ్యారు. రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత భారాస నేతలకు ఉందా? విలువలు, నిజాయతీ లేని పార్టీ భారాస. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది’’ అని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు