Jupalli: ఆదివాసీ మహిళపై దాడి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.

Updated : 22 Jun 2024 11:25 IST

కొల్లాపూర్‌: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితురాలిని, ఆమె భర్తను జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

‘‘మొలచింతలపల్లిలో ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను నిర్బంధించారు. పది రోజులుగా ఆమెను చిత్రహింసలు పెట్టారు. నిందితులను చట్టపరంగా శిక్షిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పాశవిక చర్యలు జరగడం బాధాకరం. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వపరంగా కొంత భూమిని అందిస్తాం. వారి పిల్లలకు ప్రభుత్వ పరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటాం’’ అని జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని