jyotiraditya scindia : డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా ఒక గొప్ప మార్పు: సింధియా

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆయన ముఖ్యమంత్రితో భేటీ ..

Updated : 24 Sep 2022 15:16 IST

హైదరాబాద్‌: డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా ఒక గొప్ప మార్పు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింథియా మాట్లాడారు. ‘‘విమానాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. డిజిటల్‌ ఎయిర్‌ స్పేస్‌ మ్యాప్‌ ద్వారా అనుమతులు సులభతరం చేశాం. డ్రోన్లకు అనుమతులు, నిర్వహణను సులభతరం చేశాం. విమానాశ్రయం విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వరంగల్‌, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాలకు సుముఖంగా ఉన్నాం’’ అని సింథియా వివరించారు. అంతకు ముందు జ్యోతిరాదిత్య సింధియా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. దేశంలోనే తొలిసారి వికారాబాద్‌లో డ్రోన్‌ల సాయంతో ఔషధాల పంపిణీ కార్యక్రమాన్ని సింధియా ప్రారంభించారు. మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని