Telangana News: కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడమేంటి?: కేఏ పాల్‌

కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ  అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు.

Updated : 19 May 2022 18:55 IST

హైదరాబాద్: కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ  అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రశ్నించారు. తెలంగాణలోని 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్‌కు ఒక్కరు కూడా అర్హులు కనిపించలేదా అని నిలదీశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఛైర్మన్‌ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా తెరాస నేత, గ్రానైట్‌ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను సీఎం కేసీఆర్‌ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.‘‘ఒకరు మైనింగ్‌ డాన్‌.. మరొకరు రూ.500 కోట్ల స్కామ్‌లో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంకొక్కరు భూకబ్జాలు చేసిన వ్యక్తి.. వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారు?
రాష్ట్రంలో అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది. ఈ తరహా పాలనను అంతం చేసేందుకు చివరి వరకు పోరాటం చేస్తాను. తెరాసలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఏమాత్రం బుద్ధి ఉన్నా పార్టీ నుంచి బయటకు రావాలి. అక్రమాలు, అవినీతి పాలనను ప్రశ్నించేందుకు, తెలంగాణను అప్పుల ఊబి నుంచి విడిపించి బంగారు తెలంగాణ చేయడమే నా లక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురిని విత్‌ డ్రా చేయించి అమరవీరుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలి’’ అని కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని