TS News: భాజపా నేతలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో?: కడియం

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఏడేళ్లలో ఏం సాధించిందని తెరాస ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలతో

Updated : 28 Dec 2021 15:27 IST

ప్రగతి అంటే ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్మడమా?

హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఏడేళ్లలో ఏం సాధించిందని తెరాస ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలతో పాటు బ్యాంకుల్ని కూడా నాశనం చేశారని ఆరోపించారు. ప్రగతి అంటే ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడమేనా? అని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి బడా వ్యాపారులు తీసుకున్న రుణాలను మాఫీ చేశారన్న కడియం.. ఇప్పటికే రూ.15లక్షల కోట్లకు పైగా మాఫీచేశారని, మరో రూ.10లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేయబోతున్నారంటూ ఆరోపించారు. 

రాష్ట్ర విభజన హామీలను భాజపా నిలబెట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర భాజపా నేతలు కనీసం తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకురాలేకపోయారన్నారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడలేకపోయారని.. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌, గిరిజన వర్సిటీ గురించి కూడా మాట్లాడటంలేదని ధ్వజమెత్తారు. అదనంగా ఏం ఇచ్చారని, అదనంగా ఏం తెచ్చారని రాష్ట్ర భాజపా నేతలు మిడిసిపడుతున్నారో అర్థంకావడంలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవే వస్తున్నాయి తప్ప, ఆర్థిక సంఘం  చెప్పిన ప్రకారమే నిధులు వస్తున్నాయి తప్ప రాష్ట్ర భాజపా నేతలు అదనంగా తెచ్చిందేమిటి?ఇచ్చిందేమిటని నిలదీశారు. ఇతర రాష్ట్రాలకు అనేక సెంట్రల్‌ విద్యా సంస్థలు ఇచ్చారనీ.. తెలంగాణకు మీ పలుకుబడిని ఉపయోగించి ఒక్క కేంద్ర విద్యా సంస్థనైనా తెచ్చారా?అని కడియం అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని