ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత ముందంజ

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. 5,100 ఓట్లతో కల్పలతారెడ్డి  మొదటిస్థానంలో ఉన్నారు. 3,765 ఓట్లతో పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు

Updated : 18 Mar 2021 12:20 IST

కృష్ణా: గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. 5,100 ఓట్లతో కల్పలత మొదటిస్థానంలో ఉన్నారు. 3,765 ఓట్లతో పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు రెండో స్థానంలో ఉన్నారు. 2591 ఓట్లతో మూడో స్థానంలో ఏఎస్‌ రామకృష్ణ ఉన్నారు. ఇప్పటికే చివరి 15 మందిని ఓట్ల లెక్కింపు నుంచి అధికారులు తొలగించారు. విజయానికి కల్పలతా రెడ్డి 1053 ఓట్ల దూరంలో ఉన్నారు. 

50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కల్పలతకు 3,818 ఓట్లు, నాగేశ్వరరావుకు 2,760 ఓట్లు వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని