కమల్‌.. ఓ సూపర్‌ నోటా!

తమిళనాట ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కమల్‌ పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు.........

Updated : 07 Jul 2021 15:45 IST

దిల్లీ: తమిళనాట ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కమల్‌ పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం. ఓట్ల కొట్లాటలో కమల్‌ ఒక సూపర్‌నోటాగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. లోకనాయకుడిగా ఉన్న కమల్‌కు ప్రజానాయకుడిగా ఆదరణ ఏమాత్రమూ దక్కదని, అసలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. కమల్‌ పార్టీ ముందు ముందు కొనసాగడమే కష్టమన్నారు. అన్నాడీఎంకే-భాజపా కూటమి కూడా ఏమాత్రం ఆకట్టుకోదని కార్తి అన్నారు. భాజపా హిందీ- హిందుత్వ ఎజెండా తమిళ ప్రజల ముందు చెల్లబోదన్నారు. ఇక డీఎంకే- కాంగ్రెస్‌ కూటమికి తిరుగు లేదని, 200కు పైగా స్థానాల్లో విజయదుంధుభి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. మోదీ, ఇతర భాజపా నాయకుల ఆర్భాటపు ప్రచార పర్యటనలేవీ వాళ్లకు తమిళనాట విజయాన్ని అందించలేవని విమర్శలు గుప్పించారు. వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఓ పెద్ద సున్నాగా ఉండిపోతుందని ఎద్దేవా చేశారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్‌కు అభినందనలు తెలుపుతూనే రాజకీయాలపై ఆ ప్రభావం ఏమీ ఉండబోదన్నారు. భాజపా గాలం వల్ల ప్రయోజనం శూన్యం అని తేల్చి చెప్పారు. ఏప్రిల్‌ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని