Karanam Dharmasri: జగన్‌ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు.

Published : 07 Jul 2024 05:39 IST

చోడవరం, న్యూస్‌టుడే: ‘వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారు. వ్యవస్థాగత, పరిపాలనాపరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారితీశాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో నా ఓటమికి బీఎన్‌ రహదారి గోతులే ప్రధాన కారణం. ఎన్నికలకు ముందు జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయా. సొంత నిధులు రూ.2 కోట్లు రోడ్డు అభివృద్ధికి ఖర్చు చేశా. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో, లేదో తెలియదు’ అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘నాడు తెలిసో.. తెలియకో చేసిన తప్పుల వల్ల ప్రజలు మమ్మల్ని అధికారానికి దూరం చేశారు. ఈ విషయాన్ని మేమంతా అంగీకరించాం. అవే తప్పులు చేస్తూ మీరూ అలాంటి ప్రజా తీర్పే కోరుకుంటారా’ అని తెదేపా నాయకులను ప్రశ్నించారు. ‘వైకాపాకు చెందిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆహ్వానం లేకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం మీ ఇష్టం’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని