Karnataka Results: కన్నడ పోరులో.. కాంగ్రెస్‌ అఖండ విజయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. 135 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించింది.

Updated : 14 May 2023 16:50 IST

ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీ అఖండ విజయం సాధించింది. శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక భాజపా (BJP) 66 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్‌ (JDS) 19 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.

ప్రముఖుల ఫలితాలు ఇలా..

  • కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు.
  • కర్ణాటక ముఖ్యమంత్రి భాజపా నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో గెలుపొందారు.
  • వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు.
  • చెన్నపట్టణ స్థానం నుంచి  మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి గెలుపొందగా.. ఆయన కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి రామనగరలో ఓటమిపాలయ్యారు.
  • గంగావతి నుంచి గాలి జనార్దన్‌ రెడ్డి విజయం సాధించారు.
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే చిత్తాపూర్‌లో గెలుపొందారు.
  • హుబ్బళి ధార్వాడ్‌ సెంట్రల్‌లో మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌ (కాంగ్రెస్‌) ఓడిపోయారు.
  • శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (భాజపా) విజయం సాధించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly election Results) ఫలితాలు వెలువడుతున్నాయి. విజయాల్లో మూడు పార్టీలు ఖాతా తెరవగా.. కాంగ్రెస్‌ (Congress) దూకుడు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. ఇప్పటివరకు హస్తం పార్టీ 16 స్థానాల్లో విజయం సాధించి.. మరో 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక భాజపా (BJP) నాలుగు చోట్ల గెలిచి 64 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్‌ (JDS) 1 స్థానంలో విజయం సాధించి.. 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మరో 7 చోట్ల మందంజలో ఉన్నారు. 

  • కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌ కనకపుర స్థానం నుంచి విజయం సాధించారు.
  • ఎల్లాపురా స్థానంలో భాజపా అభ్యర్థి శివరామ్‌ గెలుపొందారు.
  • హసన్‌ నియోజకవర్గంలో జేడీఎస్‌ నేత స్వరూప్‌ విజయం సాధించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌ 122 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భాజపా 66 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. జేడీఎస్‌ 30, ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. హస్తం పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రముఖుల ఫలితాల సరళి ఇలా..

  • కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
  • కనకపురా స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌ ముందంజలో కొనసాగుతున్నారు.
  • వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు.
  • చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి తొలుత వెనుకబడినా.. ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు.
  • హోళెనరసిపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్‌) ఆధిక్యంలో ఉన్నారు.
  • రామనగరలో నిఖిల్‌ కుమారస్వామి (జేడీఎస్‌) తొలుత ముందంజలో ఉండగా.. ఇప్పుడు వెనుకపడ్డారు.
  •  గాలి జనార్దన్‌ రెడ్డి దంపతులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గంగావతి స్థానం నుంచి జనార్దన్ రెడ్డి, బళ్లారి పట్టణలో గాలి లక్ష్మీ అరుణ ముందంజలో ఉన్నారు.
  • సొరబ స్థానంలో మాజీ సీఎం బంగారప్ప కుమారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కుమార బంగారప్ప (భాజపా)పై మధు బంగారప్ప (కాంగ్రెస్‌) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • హుబ్బళి ధార్వాడ్‌ సెంట్రల్‌లో మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌ (కాంగ్రెస్‌) వెనుకంజలో ఉన్నారు.
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే చిత్తాపూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (భాజపా) ముందంజలో ఉన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. మొత్తం 36 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (Counting) ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో కాంగ్రెస్‌ మెజార్టీ మార్క్‌ దాటింది. మొత్తం 115 స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా.. 73 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్‌ 28 చోట్ల ముందంజలో ఉండగా.. 8 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. (Karnataka Results)

ప్రముఖుల ఫలితాల సరళి ఇలా..

  • కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
  • కనకపురా స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌ ముందంజలో కొనసాగుతున్నారు.
  • వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు.
  • చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి తొలుత వెనుకబడినా.. ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు.
  • హోళెనరసిపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్‌) ఆధిక్యంలో ఉన్నారు.
  • రామనగరలో నిఖిల్‌ కుమారస్వామి (జేడీఎస్‌) ముందంజలో కొనసాగుతున్నారు.
  •  గాలి జనార్దన్‌ రెడ్డి దంపతులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గంగావతి స్థానం నుంచి జనార్దన్ రెడ్డి, బళ్లారి పట్టణలో గాలి లక్ష్మీ అరుణ ముందంజలో ఉన్నారు.
  • సొరబ స్థానంలో మాజీ సీఎం బంగారప్ప కుమారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కుమార బంగారప్ప (భాజపా)పై మధు బంగారప్ప (కాంగ్రెస్‌) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • హుబ్బళి ధార్వాడ్‌ సెంట్రల్‌లో మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌ (కాంగ్రెస్‌) వెనుకంజలో ఉన్నారు.
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే చిత్తాపూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (భాజపా) ముందంజలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని