BRS: మేం ఎల్లప్పుడూ కేసీఆర్‌తోనే: మాజీ సీఎం కుమారస్వామి

కేసీఆర్‌ నాయకత్వంలో  భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ పార్టీ అవతరణ చరిత్రాత్మక ఘట్టమని జనతాదళ్‌(సెక్యులర్‌) కీలక నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.

Published : 09 Dec 2022 21:43 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ నాయకత్వంలో భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) జాతీయ పార్టీగా అవతరణ చరిత్రాత్మక ఘట్టమని జనతాదళ్‌(సెక్యులర్‌) కీలక నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. భారాస ఆవిర్భావం భారత రాజకీయాల్లో అద్భుత మైలురాయి అని అన్నారు. రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల గొంతుకగా భారాస పనిచేస్తుందన్నారు. భారాస జాతీయ రాజకీయాల్లో సరికొత్త సమీకరణకు నాంది పలుకుతుందని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘జాతీయ రాజకీయాల్లో భారాస ఘనవిజయం సాధించాలి. కేసీఆర్‌, ఆశయాలు, కలలు నెరవేరాలి. మేం ఎల్లప్పుడూ కేసీఆర్‌తోనే ఉంటాం. జేడీఎస్‌కు పూర్తి సహకరిస్తామన్న కేసీఆర్‌కు ధన్యవాదాలు’’ అని కుమారస్వామి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని