Rahul: కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయం: రాహుల్‌ ఫైర్

కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బసవరాజ్‌ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయని ఆరోపించారు....

Published : 04 Oct 2022 01:06 IST

మైసూరు: కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బసవరాజ్‌ బొమ్మై సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయని ఆరోపించారు. కర్ణాటక భాజపా సర్కార్‌ లంచం తీసుకుంటోందని కాంట్రాక్టర్లు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో 40శాతం కమిషన్‌తో పనిచేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల నుంచీ లంచాలు తీసుకుంటోందని.. దీంతో రైతులు, కార్మిక వర్గాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రామిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాని చెప్పారు. 26వ రోజు భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఆయన కర్ణాటకలోని పాత మైసూరు వీధుల్లో రాహుల్‌ నడిచారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు నిలబడి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్‌.. రాహుల్‌.. అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు 600కి.మీలకు పైగా రాహుల్‌ పాదయాత్ర కొనసాగింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని