TG News: ఓటమిపై కేసీఆర్‌ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు

మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 06 Jul 2024 03:49 IST

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: మాజీ సీఎం, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఎన్నికల్లో ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. భారాస ఓటమితో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పదేళ్లు ప్రజలు, సమస్యలను పట్టిచ్చుకోకుండా పరిపాలన చేసిన కేసీఆర్‌..తమ ఓటమిపై ప్రజలు బాధపడుతున్నారనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని