Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ హామీలు

పంజాబ్‌ ఎన్నికల్లో భారీ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్‌పై దృష్టి పెట్టింది. ....

Published : 17 Aug 2022 02:17 IST

భుజ్‌: పంజాబ్‌ ఎన్నికల్లో భారీ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్‌పై దృష్టి పెట్టింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపించుకొనేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవలి కాలంలోనే నాలుగు సార్లు పర్యటించారు. తాజాగా గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్‌ను అధికారంలోకి తీసుకొస్తే దిల్లీ తరహాలో నాణ్యమైన పాలనను అందిస్తామని గుజరాత్‌ ఓటర్లకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత, నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. మంచి విద్యాప్రమాణాలతో పేదరికాన్ని నిర్మూలించొచ్చని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడంతో పాటు కొత్త పాఠశాలలను సైతం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, తాము అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల్లో ఆడిట్‌ నిర్వహిస్తామని.. దిల్లీలో చేసినట్టుగానే తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇప్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించనున్నట్టు కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని