మేం అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ విద్యుత్ ఉచితం!

 వచ్చే ఏడాదిలో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ....

Published : 29 Jun 2021 01:35 IST

పంజాబ్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ హామీ

దిల్లీ:  వచ్చే ఏడాదిలో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. ఆయన రేపు చండీగఢ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. నిత్యావసర సరకులు ఖరీదైపోవడంతో ఇంటిని నిర్వహించడం మహిళలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలో తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి  200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోందన్నారు. దీంతో అక్కడి మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. పంజాబ్‌లో ద్రవ్యోల్బణంతో మహిళలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యుత్‌ అందిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2023లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని