Kerala: ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా: కేరళ గవర్నర్‌

వీసీల నియామకం విషయంలో రాజకీయంగా తాను జోక్యం చేసుకుంటున్నానంటూ సీఎం చేసిన విమర్శలను గవర్నర్‌ తోసిపుచ్చారు. ఒక్క ఉదాహరణ చూపించాలని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు.

Published : 04 Nov 2022 01:14 IST

దిల్లీ: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, పినరయి విజయన్‌ సర్కారు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. వీసీల నియామకం విషయంలో రాజకీయంగా తాను జోక్యం చేసుకుంటున్నానంటూ సీఎం చేసిన విమర్శలను గవర్నర్‌ తోసిపుచ్చారు. ఒక్క ఉదాహరణ చూపించాలని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే తాను గవర్నర్‌ పదవి నుంచి వైదొలుగుతానన్నారు.

‘‘ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులను వీసీలను నియమించేందుకు గవర్నర్‌ ప్రయత్నిస్తున్నారని వారు (వామపక్ష ప్రభుత్వం) విమర్శిస్తున్నారు. ఆరెస్సెసే కాదు.. నా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ వ్యక్తిని నియమించినా నేను రాజీనామా చేస్తా. నాపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే మీరు ఆ పనిచేస్తారా’’ అని సీఎం విజయన్‌కు గవర్నర్‌ సవాల్‌ విసిరారు. సీఎం, సీఎం అనుచరులు స్మగ్లింగ్‌ కార్యకలాపాల్లో పాల్పడితే మాత్రం తప్పకుండా జోక్యం చేసుకుంటానని పేర్కొన్నారు. కేరళ యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌కు చెందిన వ్యక్తులను నియమించేందుకు గవర్నర్‌ ప్రయత్నిస్తున్నారని బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో విజయన్‌ విమర్శించారు. రాజ్‌భవన్‌ను వేదికగా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ పై విధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని