Keshava Rao: ప్రభుత్వ సలహాదారుగా కేకే

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్‌ ఎఫైర్స్‌) సలహాదారుగా ఆయనను క్యాబినెట్‌ మంత్రి హోదాలో నియమించింది.

Published : 07 Jul 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావును నియమిస్తూ రాష్ట్ర సర్కారు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజా వ్యవహారాల విభాగం(పబ్లిక్‌ ఎఫైర్స్‌) సలహాదారుగా ఆయనను క్యాబినెట్‌ మంత్రి హోదాలో నియమించింది. ఇటీవల కేకే.. భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరారు. భారాస రాజ్యసభ సభ్యుడిగా గతంలో ఎన్నికైన ఆయన కాంగ్రెస్‌లో చేరగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది. ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో పాటు గతంలో భారాసకన్నా ముందు కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో ఆయన పలు పార్టీ పదవుల్లో పనిచేశారు. ఆయన అనుభవం అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఉపకరిస్తుందని సలహాదారుగా నియమించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని