Keshava Rao: కేశవరావు రాజీనామాకు ఆమోదం

రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం ఆమోదించారు.

Published : 06 Jul 2024 03:48 IST

ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక

ఈనాడు, దిల్లీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చేసిన రాజీనామాను ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ శుక్రవారం ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లో ఎగువ సభకు ఎన్నికైన కేకే పదవీకాలం 2026 ఏప్రిల్‌ వరకు ఉంది. మిగిలిన కాలపరిమితికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని