Kesineni Chinni: జైలు జీవితం కోసం జగన్‌ ఎదురుచూడటమే తరువాయి: కేశినేని చిన్ని

ప్రజల సొమ్ము దోచేసిన జగన్‌ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) ఆరోపించారు. దుర్వినియోగం చేసిన ప్రజా ధనాన్ని ఆయన సొంత ఖర్చుల నుంచి వసూలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

Updated : 18 Jun 2024 11:38 IST

విజయవాడ: ప్రజల సొమ్ము దోచేసిన జగన్‌ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) ఆరోపించారు.  విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాధనం దోచుకున్నవాళ్లను ఎవరినీ వదిలిపెట్టేది లేదు. తిన్న సొమ్మంతా కక్కించేలా చట్టాన్ని తయారు చేయాలి. ప్రజాధనం దోచుకున్న వారి చిట్టా బయటపడటం ఖాయం. జైలు జీవితం కోసం జగన్‌ ఎదురుచూడటమే తరువాయి. జగన్‌ వల్ల ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇబ్బంది పడ్డారు’’ అని అన్నారు.

‘‘ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడారో ఓసారి జగన్ వినాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాల్లో బతికితే జగన్‌కు ఆ 11 మందైనా మిగులుతారు. లేదంటే ఆ పార్టీ 3 నెలల్లో మూతపడుతుంది’’ అని చిన్ని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని