Kesineni Nani: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన కేశినేని నాని

సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ పంచన చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు.

Published : 10 Jun 2024 18:49 IST

విజయవాడ: సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్‌ పంచన చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి కృషిచేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని తన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని