YSRCP: ఎన్నికల్లో ఘోర పరాజయం.. వైకాపాలో కీలక మార్పులు

ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైకాపాలో కీలక మార్పులు జరగనున్నాయి.

Published : 06 Jun 2024 17:51 IST

అమరావతి: ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైకాపాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రస్తుతం ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయం మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తాడేపల్లిలోని జగన్‌ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి పార్టీ కార్యాలయం మార్చాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటి వరకు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనం వైకాపా కేంద్ర కార్యాలయంగా మారనుంది. జూన్‌ 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలింపునకు వైకాపా శ్రేణులు సిద్ధం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని