Congress: CWC స్థానంలో తాత్కాలికంగా స్టీరింగ్‌ కమిటీ.. సభ్యులు వీరే..

అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణయాక మండలిగా ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) స్థానంలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

Updated : 26 Oct 2022 21:14 IST

దిల్లీ: అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే తొలి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) స్థానంలో తాత్కాలికంగా స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీతో పాటు 47మంది ఈ స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (b) ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో తక్షణ నిర్ణయాల కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఖర్గే ఎన్నికను ఆమోదించిన తర్వాత నూతన సీడబ్ల్యూసీ ఏర్పడే వరకు ఈ స్టీరింగ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకోనుంది. 

పార్టీ మాజీ అధ్యక్షులైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఈ స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, అభిషేక్‌ మను సింఘ్వి, ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌, చిందంబరం, రణ్‌దీప్ సూర్జేవాలా, అధిర్‌ రంజన్‌ చౌదరి, దిగ్విజయ్‌ సింగ్‌, మాణికం ఠాగూర్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ వంటి వారు స్టీరింగ్‌ కమిటీలో చోటు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుబ్బరామిరెడ్డికి ఈ కమిటీలో చోటు దక్కింది. G-23 వర్గంలో ఉన్న ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌కు సైతం ఈ కమిటీలో చోటు దక్కింది. అంతకుముందు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులంతా కొత్త కమిటీ ఏర్పాటుకు వీలుగా తమ పదవులలకు రాజీనామా చేశారు.

పూర్తి జాబితా ఇదే..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని