Published : 30 May 2022 02:19 IST

Andhra News: వైకాపా సర్కారుపై తిరుగుబాటు మొదలైంది: అచ్చెన్నాయుడు

ఒంగోలు: చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని, నిన్నటి సభతో ఆ విషయం రూడీ అయిందన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెదేపా నేతలను అభినందించారు. మహానాడుకు స్థలం ఇచ్చిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్టు చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని