Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్‌ కుమార్‌ రెడ్డి

తనకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు.

Updated : 31 May 2023 19:03 IST

హైదరాబాద్‌: భాజపా అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే అక్కడే పనిచేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తనకున్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. జూబ్లీహిల్స్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఆయనతో భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మధుకర్‌ భేటీ అయ్యారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భాజపాలో చేరిన తర్వాత నెల రోజులపాటు తాను అమెరికా వెళ్లినట్లు చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏపీలో వైకాపా పాలనపై స్పందిస్తానన్నారు. 

ఏపీలో భాజపా బలోపేతం విషయమై కిరణ్‌ కుమార్‌ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయనకు వివరించామన్నారు. అలాగే కిరణ్‌ కుమార్ రెడ్డి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయన దగ్గర పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని, కిరణ్‌కుమార్‌రెడ్డి మార్గ నిర్దేశనంలో పనిచేస్తామని వీర్రాజు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని